స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టో తప్పన్నట్లు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని.. మాజీమంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. స్థానిక సంస్థలకు మేనిఫెస్టో విడుదల కొత్త సంప్రదాయమేమీ కాదన్నారు. పార్టీ గుర్తు లేకపోయినా.. పార్టీలు బలపరిచే అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలనే మేనిఫెస్టో ద్వారా పిలుపునిచ్చామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏం చేయలేకపోతున్నందునే స్వయం పాలన కోసం తెదేపా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు వివరిస్తారని తెలిపారు.
ఇదీచదవండి
తెదేపా అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: చంద్రబాబు