అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం యాగశాలలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీమహాలక్ష్మి మహామంత్ర హవనం చేపట్టారు. ఈ క్రతువులో పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వాహణాధికారి సురేష్ బాబు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులను అనుమతించడంలేదు. నిత్య కైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి.. కరోనా ఎఫెక్ట్: వణుకుతున్న విజయవాడ