ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: వణుకుతున్న విజయవాడ

విజయవాడ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 3 రోజులుగా నగరంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం నగరంలోనే ఉండడం నగర వాసులతో పాటు అధికారులనూ ఆందోళనకు గురిచేస్తోంది. లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.

corona effect in vijayawada covid positive cases gradually increased in vijayawada city
విజయవాడలో అధికమవుతున్న కరోనా కేసులు
author img

By

Published : Apr 26, 2020, 7:29 PM IST

విజయవాడ నగరంపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. ఈ మహమ్మారి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గడిచిన 72 గంటల్లో బెజవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 91 కేసులు నమోదు కావడం భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ప్రస్తుతం 140 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయి. 29 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా 8 మంది మృతిచెందారు. గత 3 రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం అధికార యంత్రాంగానికి చెమటలు పట్టిస్తోంది.

లాక్ డౌన్ మరింత కఠినతరం

వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్​లో తాజాగా నగరంలో 52 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 24 కృష్ణలంక ప్రాంతంలోనే ఉన్నాయి. 18 కేసులు మాచవరం పరిధిలోని కార్మికనగర్​లో ఉండగా.. ఖుద్దూస్ నగర్​లో 4, జింఖానా గ్రౌండ్స్ సమీపంలో 4, గూడవల్లి ప్రాంతంలో 2 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నా గత 3 రోజులుగా అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. కేసులు ఎక్కువగా నమోదైన కృష్ణలంక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసు వాహనాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ బయటకు రావద్దని.. నిబంధనలు ఉల్లఘించి ఎవరైనా బయటకు వస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిత్యం పహారా

నగరంలో వైరస్ విస్తృతి దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం పూర్తి స్థాయిలో మాంసం దుకాణాలను మూయించేశారు. కృష్ణలంక ప్రాంతంలో లారీ డ్రైవర్ కారణంగా కేసుల సంఖ్య పెరిగినందున ఆ ప్రాంతానికి చెందిన 300 మంది అనుమానితులను క్వారంటైన్​కి తరలించారు. నగరానికి పెద్దఎత్తున చేరుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు రెడ్ జోన్లలో నిత్యం పహారా కాస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిని వీరు అదుపులోకి తీసుకుంటారు.

ఇవీ చదవండి.. 'చేయూతనివ్వండి... గెలిచి చూపిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.