ఎన్నికలకు ముందు ఎంత భద్రంగా బ్యాలెట్ పత్రాలను చూసుకుంటారో... వినియోగించిన దానినీ అంతే జాగ్రత్తగా దాచిపెడతారు. విజేతలను ప్రకటించిన తర్వాత ఓటర్లు తీర్పునిచ్చిన బ్యాలెట్ పత్రాలను గ్రామాలవారీగా ప్రత్యేకమైన పెట్టెల్లో భద్రపరుస్తారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించిన గ్రామ పంచాయతీ స్టేజ్-2 అధికారులు సదరు బ్యాలెట్ పత్రాలు, ఎన్నికలకు వినియోగించిన పత్రాలను మండల పరిషత్ అధికారులకు అందజేస్తారు. వాటిని ప్రత్యేకమైన పెట్టెల్లో పోలీసుస్టేషన్‌ల్లో కానీ, ట్రెజరీ కార్యాలయాల్లో కాని భద్రపరుస్తారు. వినియోగించిన బ్యాలెట్ పత్రాలను అయిదేళ్లపాటు దాచి ఉంచుతారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి వాటిపై.. వివాదం నెలకొని కోర్టుల్లో అప్పీలు చేస్తే వారి ఉత్తర్వుల మేరకు స్టేజ్-2 అధికారులు ఈ పెట్టెలను తెరుస్తారు.
ఇదీ చదవండి: ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్