ETV Bharat / city

'మా' ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అమ్మకే తెలియాలి : హేమ - ఏపీ తాజా వార్తలు

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను నటి హేమ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా నవరాత్రుల్లో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. 'మా' ఎన్నికల్లో రాత్రి గెలిచామని చెప్పారని.. ఉదయానికి ఓడిపోయామని.. ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలని అన్నారు.

Actress Hema
Actress Hema
author img

By

Published : Oct 14, 2021, 1:49 PM IST

'మా' ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అమ్మకే తెలియాలి : హేమ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల్లో తమ ప్యానెల్‌ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలని నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించి.. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ హేమ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎంతగానో ఆరాధించే దుర్గమ్మ దీవెనలు పొందడం ఆనందంగా ఉందన్నారు.

‘‘నాకు దుర్గమ్మపై అపారమైన నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా అమ్మ దీవెనలు పొందడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి’- హేమ

‘మా’ ఎన్నికల స్పందన..

‘రాత్రికి గెలిచి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదు. దానికి గల కారణం అమ్మవారికైనా తెలుసో లేదో’ అని హేమ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తరఫు నుంచి హేమ పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరి ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితం అంతటా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10న ఆమె గెలిచినట్లు చెప్పి.. 11న ఆమె ఓడిపోయిందని ప్రకటించారు.

ఇదీ చదవండి: Yanamala: తెదేపా అధికారంలోకి రావడం ఖాయం: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.