సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా మంత్రి అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంత్రిగా ఉన్న వ్యక్తి సర్దార్ బిరుదు గ్రహీతపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. చదువుకున్న ముర్ఖుల్లా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించలేని వ్యక్తికి మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. వేల కోట్లు దోచుకున్న జగన్రెడ్డి భజన చేయాలనుకుంటే చేసుకోవాలి కానీ బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌతు లచ్చన్న గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న పడిన తాపత్రయాన్ని గుర్తించలేని మూర్ఖుడు వైద్యుడు, మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలని దుయ్యబట్టారు. వంద మంది జగన్ రెడ్డిలు వచ్చినా గౌతు లచ్చన్న విగ్రహానికి ఉన్న పెయింట్ పెచ్చు కూడా కదపలేరని వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి