ETV Bharat / city

యువకుడు హల్​చల్​.. మూడంతస్థుల భవనం పైనుంచి దూకుతానని బెదిరింపు - man Hulchul in Vijayawada

విజయవాడ అజిత్​సింగ్ నగర్​లో ఓ యువకుడు హల్​చల్ చేశాడు. మూడు అంతస్థుల భవనం పైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. పోలీసులు, స్థానికులు అతనికి నచ్చజెప్పేందుకు యత్నించారు. చివరకు పోలీసుల హామీతో అతను కిందకు దిగాడు.

man suicide attempt in Vijayawada
man suicide attempt in Vijayawada
author img

By

Published : Dec 21, 2020, 10:41 PM IST

విజయవాడలో యువకుడు హల్​చల్

విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో ఓ వ్యక్తి భవనం పైనుంచి దూకుతానంటూ హల్​చల్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనితో మాట్లాడుతూనే కింద వలలు పట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. వంద మందికి పైగా జనం అక్కడ గుమిగూడారు. చివరికి కేసు నమోదు చేయకుండా స్వగ్రామానికి ఛార్జీలు ఇచ్చి పంపుతామని సీఐ లక్ష్మీ నారాయణ హామీ ఇవ్వటంతో అతను కిందకు దిగాడు. వెంటనే అదుపులోకి తీసుకొని అజిత్‌ సింగ్‌ నగర్ స్టేషన్​కు తరలించారు.

ఆ వ్యక్తి చిత్తూరు జిల్లా కాణిపాకానికి చెందిన బాలాజీగా గుర్తించారు. ఎటువంటి ఆపద లేకుండా వ్యక్తిని కిందకు దించటంతో పోలీసులను స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి

భువనేశ్వరిది ఆత్మహత్యే: ఎస్పీ సిద్దార్థ కౌశల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.