ETV Bharat / city

పెళ్లైన 24 గంటల్లోనే.. మరో పెళ్లి చేసుకున్న యువతి - నల్గొండ జిల్లా కనగల్​ తాజా వార్తలు

ఒకరిని ప్రేమించింది. ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించింది. పెళ్లి చేసుకుంది. ఇంతలో అక్కడికి తాను ప్రేమించిన యువకుడు వచ్చాడు. తర్వాత ఏమైందంటే..

a women got another marriage within 24 hours in nalgonda district
పెళ్లైన 24 గంటల్లోనే.. మరో పెళ్లి చేసుకున్న యువతి
author img

By

Published : Jun 14, 2020, 3:02 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ మండలంలో వింత ఘటన జరిగింది. ముందుగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న మౌనిక అనే ఓ యువతి.. మర్నాడు తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది.

కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 12న వారి వివాహం జరిగిపోయింది.

అప్పుడే అసలు కథ మొదలైంది. మౌనిక తనకు వరుసకు మామయ్య అయ్యే రాజేశ్​తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు మౌనికకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పే ధైర్యం లేని మౌనిక పెళ్లికి అంగీకరించింది. వివాహమూ చేసుకుంది. కట్​చేస్తే పెళ్లయిన కాసేపటికి అక్కడికి రాజేశ్​ వచ్చాడు. అతడిని చూసిన మౌనిక.. వెంటనే అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఫలితంగా మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. రంగంలోకి పోలీసులూ దిగారు. పలు చర్చల తర్వాత తాము ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు తేల్చి చెప్పారు. దాంతో ఈనెల 13న రాజేశ్​, మౌనికలు మళ్లీ వివాహం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ప్రత్యర్థుల్లా ఉండాలి.. విరోధులుగా కాదు: గోరంట్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.