ETV Bharat / city

Wife protest for husband : 'మా ఆయన.. నాక్కావాలి' భర్త ఇంటిఎదుట మహిళ పోరాటం..! - తెలంగాణ వార్తలు

Wife protest for husband : తనను వివాహం చేసుకొని.. పట్టించుకోకుండా ఉన్న వ్యక్తిపై ఓ వివాహిత పోరాటం చేస్తోంది. తన భర్త.. తనకు కావాలని డిమాండ్​ చేస్తూ.. భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అత్తారింట్లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తానని చెబుతోంది.

భర్త కోసం పోరాటం.. 'మా ఆయన నాకు కావాలి'
భర్త కోసం పోరాటం.. 'మా ఆయన నాకు కావాలి'
author img

By

Published : Dec 22, 2021, 6:21 PM IST

Wife protest for husband : భర్త ఇంటిముందు ఓ వివాహిత ధర్నాకు దిగింది. తన భర్త.. తనకు కావాలని డిమాండ్ చేస్తోంది. న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటకు చెందిన... సందీప్ రెడ్డి, శ్రీలతకు 2012లో వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే సంసారం సాగినప్పటికీ... ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తాము కలిసి ఉండడం లేదని... తన భర్త తనను దూరం పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యం మద్యం సేవించే అలవాటున్న తన భర్త... తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే తనను పెళ్లి చేసుకున్నానని చాలాసార్లు చెప్పినట్లు వాపోయింది.

ఇప్పటికే చాలాసార్లు ఫోన్​ చేసినప్పటికీ... స్పందించలేదని శ్రీలత తెలిపింది. తన భర్తతోనే కలిసి ఉంటానని చెప్పింది. సందీప్​తో కలిసి ఉండేలా... తనకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. అత్తగారింట్లో రావడానికి తనకు అనుమతి వచ్చే వరకు ధర్నా చేస్తానని తేల్చి చెప్పింది. పోలీసులు, కోర్టులను సందీప్ పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని శ్రీలత ఆరోపించింది.

తన భర్తతోనే కలిసి ఉండడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 'నేను మా ఆయనతో కలిసి ఉండడానికి వచ్చాను. నాకు ఇంకేం వద్దు. నా భర్త నాకు కావాలి' అంటూ శ్రీలత విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక కేసులో కీలక మలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.