విజయవాడ నగర శివారు రామవరప్పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కూడలి వద్ద సైకిల్ పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొంది. ప్రమాదంలో సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఏలూరు రోడ్డులో నుంచి కరెన్సీనగర్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండీ.. Brutal Murder: సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య