విజయవాడ(Vijayawada)లోని అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రిలో నూతనంగా బోన్ మారో యూనిట్(bone marrow unit) ప్రారంభించారు. దీని ద్వారా కాన్సర్ రోగులకు మూలకణ మార్పిడితో వైద్యచికిత్స చేయవచ్చని డా.రాజేష్ మల్లిక్ తెలిపారు. కాన్సర్‌తో పాటు కొన్ని రక్తసంబంధమైన సమస్యలకు కూడా చికిత్స అందించే అవకాశముందన్నారు. గతంలో బోన్ మారో చికిత్స((bone marrow unit) ) కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మూలకణ చికిత్స యూనిట్‌ను అందుబాటులోకి తేవటం చాలా సంతోషంగా ఉందన్నారు. దీంతో ఇతర కాన్సర్లకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన సిబ్బందితో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దేశమంతా తమ సేవలను విస్తృతం చేస్తామని డా.విజయ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి