murder attempt: కృష్ణాజిల్లా ఉయ్యూరు మార్కెట్ సెంటర్లో హత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. తోట్లవల్లూరు మండలం బుడ్డ లంక గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పాత గొడవల నేపథ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తితో పొడిచి దాడి చేసిన నిందితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినట్లు సమాచారం.
ఇదీ చదవండి: దంపతుల మధ్య మనస్పర్థలు.. భార్య ఆత్మహత్య