విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో అదృశ్యం అయిన వృద్ధుడు కుటుంబీకులని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ బాబు పరామర్శించారు. వయోవృద్ధుడైన తన భర్తను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చానని బాధితురాలు తెలిపారని మహేశ్ అన్నారు. వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న వీడియోలు ఉన్నాయన్నారు.
కరోనా పోరులో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులను తాము విమర్శించబోమన్న మహేశ్.. నిర్లక్ష్యం తగదని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. జనసేన పార్టీ తరుపున బాధితురాలికి అండగా ఉంటామన్నారు.
ఇదీ చదవండి : కొవిడ్ నిబంధనలకు నీళ్లు.. వైకాపా నేతల ప్రమాణ కార్యక్రమం