విజయవాడ ఏలూరు రోడ్డులో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుంది. అర్ధరాత్రి సమయంలో ఏలూరు రోడ్డులోని గుణదల కూడలి వద్ద రోడ్డు వెంబడి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అదుపుతప్పి పక్కనే పార్కింగ్ చేసిన మూడు కార్లనూ ఢీకొట్టింది. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంలో పార్కింగ్ చేసి ఉన్న 3 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో అర్ధరాత్రి కారు బీభత్సం..మూడు వాహనాలు ధ్వంసం - విజయవాడ తాజా వార్తలు
విజయవాడ ఏలూరు రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. నిలిపిన ఉన్న మూడు కార్లను ఢీకొంది. ఈ ఘటనలో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు.