ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 9 PM

9pm_Topnews
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Mar 24, 2021, 9:00 PM IST

  • 'నెలలో కోటి మందికి టీకాలు వేయాలి'

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్ కార్యచరణపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ టీకాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మహమ్మారి విస్తరణ

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 585 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. కొవిడ్‌ కారణంగా నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • లేఖలు నిజమే: పీఎంవో

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రధానికి రెండుసార్లు లేఖ రాయటాన్ని పీఎంవో నిర్థారించింది. దీనిపై స్పందించిన పీఎంవో నిర్ణీత గడువులోగా సరైన సమాధానం పంపాలని సంబంధిత విభాగానికి సూచించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నామినేషన్ దాఖలు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్‌ వేశారు. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కాంగ్రెస్​ వస్తే చొరబాట్లు, అవినీతి'

అసోంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాట్లు, అవినీతి పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఓటర్లను హెచ్చరించారు. అసోం ప్రత్యేకతను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఏఐయూడీఎఫ్​తో కాంగ్రెస్​ చేతులు కలిపిందని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బిల్లుకు​ ఆమోదం

కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్​ కమిషన్​ ఫర్​ అలైడ్​ హెల్త్​కేర్​ ప్రొఫెషన్స్ బిల్లు- 2021కి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఆరోగ్య రంగానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న డిమాండ్​లను తీర్చే విధంగా ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భారత్​కు​ కృతజ్ఞతలు

భారత్​ నుంచి కొవిడ్​ టీకా సాయం అందడంపై మారిషస్​ హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి ఆ దేశ ప్రధాన మంత్రి ప్రవీంద్​ జగ్​నాథ్​ ధన్యవాదాలు చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విడుదలకు​ రెడీ

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మేడ్ ఇన్​​ ఇండియా వేరియంట్​ 220ఐ స్పోర్ట్​ మార్కెట్లోకి విడుదలైంది. 7.1 సెకన్లలో.. 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉన్న ఈ కొత్త వేరియంట్ ధర సహా.. భారత్​లో త్వరలో విడుదల కానున్న ట్రయంఫ్​ ట్రైడెంట్​ 660 బైక్​ విశేషాలు మీకోసం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శుభారంభం

పారిస్ వేదికగా జరుగుతున్న ఓర్లీన్ మాస్టర్స్​లో భారత షట్లర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. మహిళల సింగిల్స్​లో సైనా.. పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్​ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆ సినిమాలో న్యాయవాదిగా రవితేజ!

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ఆర్టీ68' వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ లాయర్​ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.