ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

9pm_Topnews
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Mar 8, 2021, 9:01 PM IST

  • 'విశాఖ ఉక్కు అమ్మేస్తాం'
    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. మరోవైపు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 2022 ఏప్రిల్​కు పూర్తి
    పోలవరం నిర్మాణ పనులపై రాజ్యసభలో కేంద్రం వివరణ ఇచ్చింది. పోలవరం పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయని తెలిపింది. తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి కటారియా లిఖితపూర్వక జవాబిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'మహిళా సాధికారతే లక్ష్యం'
    మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం జగన్ ‌శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ సందర్భంగా.. మహిళల భద్రత కోసం దిశ వాహనాలను, దిశ క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వాహనాలు ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రచారానికి తెర
    మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో మార్మోగిన నగరాలు, పట్టణాల్లో ఒక్కసారిగా ప్రశాంతత నెలకొంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియగా.. చివరి నిమిషం వరకూ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం సాగించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'త్వరలోనే దేశానికి 'మోదీ' పేరు!'
    ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. దేశానికి మోదీ పేరు పెట్టే రోజు దగ్గరలోని ఉందని ధ్వజమెత్తారు దీదీ. మొతేరా మైదానానికి మోదీ పెట్టడం సహా కొవిడ్​ వ్యాక్సినేషన్​ ధ్రువపత్రాలపై మోదీ ఫొటో ముద్రించడంపై మండిపడిన మమత ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'పేద దేశాలకు భరోసా'
    కొవాక్స్​ కార్యక్రమంలో భాగంగా భారత్​ ఇప్పటివరకు 3.3 కోట్ల డోసులను పేద దేశాలకు అందించిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. భారత్​... ప్రపంచానికే టీకా హబ్​గా ఏర్పడాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'రాజకుటుంబంలోకి వచ్చాక చచ్చిపోదామనుకున్నా'
    అమెరికాలోని పాపులర్​ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రిన్స్​ హ్యారీ, మేఘన్​ మార్కెల్​ దంపతులు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్‌ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు మేఘన్​ మార్కెల్​. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఏడాది గరిష్ఠానికి
    అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు దాదాపు ఏడాది గరిష్ఠానికి పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీ అరేబియాలోని క్రూడ్ స్థావరాలపై హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం దాడికి తెగబడటం వల్ల ధరలు ఈ స్థాయికి పెరిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వేదిక మార్పు
    ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ వేదిక మారనుంది. లండన్​లోని లార్డ్స్​ నుంచి మ్యాచ్​ను సౌతాంప్టన్​కు తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'కారణం లేకుండానే నిందించారు'
    గత కొన్నేళ్లుగా తాను ఎంతోమంది నెగెటివ్​ కామెంట్లు ఎదుర్కొన్నానని అంటున్నారు ప్రముఖ గాయని సునీత. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆమె ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తన జీవితంలో చవిచూసిన ఇబ్బందులను ప్రతిబింబించేలా ఓ పోస్ట్​ పెట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.