ETV Bharat / city

Youtube Star: ఏడేళ్ల బుడ్డోడికి ;ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డ్–2022' - కామారెడ్డి జిల్లా వార్తలు

Chathur Darling: బుడిబుడి అడుగుల ప్రాయంలోనే స్టెప్పులతో బుడతడు అదరగొడుతున్నాడు. ఏ, బీ, సీ, డీలు నేర్చుకునే వయసులోనే.. మాస్‌ డైలాగ్స్​తో దుమ్ములేపుతున్నాడు. ఏడేళ్ల ప్రాయంలోనే స్టార్‌ అయిపోయాడు. అలాగని.... ఆ పిల్లాడు ఏ సినిమాలోనూ కనిపించిన బాలనటుడు కాదు. అద్భుత నటనతో యూట్యూబ్‌లో తనకంటూ ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకుని వారెవ్వా అనిపిస్తున్నాడు.. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన చతురణన్.

Chathur Darling
'ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్–2022' ఏడేళ్ల బుడ్డోడికి
author img

By

Published : Apr 3, 2022, 10:10 AM IST

Chathur Darling: తెలంగాణలోని కామారెడ్డికి చెందిన అర్చన, సంతోష్‌ దంపతుల కుమారుడైన చతురణన్‌.. బుడిబుడి అడుగులు వేసేటప్పుడే టీవీ చూస్తూ డ్యాన్స్‌ చేస్తుండేవాడు. మూడేళ్ల వయసులోనే శిక్షణ తీసుకున్నట్లుగా వేస్తున్న స్టెప్పులతో ఆశ్చర్యానికి గురైన తల్లిదండ్రులు.. మురిసిపోతూ, వీడియోలు తీసి బంధువులు, స్నేహితులకు పంపుతుండేవారు. ఇలా... రోజు స్కూల్‌ నుంచి రాగానే టీవీలో ఏదో ఓ పాట పెట్టుకోవడం, డ్యాన్స్‌ చేయడం చేస్తుండేవాడు. బాబు ప్రతిభను గుర్తించిన తండ్రి సంతోష్‌.. సినిమా పాటలు, టీజర్లను చూపించి అలాగే చేయమంటూ ప్రోత్సహిస్తుండేవారు. కొత్త సినిమా టీజర్‌ రావటమే ఆలస్యం.. దాన్ని మించి నటిస్తూ అందరినీ ఆకట్టుకోసాగాడు. ‘చతుర్‌ డార్లింగ్‌’ పేరుతో తల్లిదండ్రులు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి చిన్నారి వీడియోలను అందులో అప్‌లోడ్‌ చేయటం ప్రారంభించారు. చతురణన్‌ చాతుర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

'ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్–2022' ఏడేళ్ల బుడ్డోడికి

చతురణన్‌ ఛానల్‌కు 6 వేల మంది వరకు సబ్‌స్క్రైబర్లున్నారు. లక్షల మంది వీడియోలను వీక్షిస్తుంటారు. ‘పుష్ప, బీమ్లానాయక్‌ టీజర్‌ స్పూఫ్స్‌ నవ్వులు పూయిస్తున్నాయి. ఇలా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న చతురణన్‌ ప్రతిభకు గుర్తింపుగా.. ఉత్తమ నటన పిల్లల విభాగంలో 'ఫెమోప్స్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డ్–2022' చతురణన్‌ వరించింది. తనలోని అద్భుత ప్రతిభను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచానికి చాటిచెబుతున్న చతురణన్‌ చాతుర్యం.... నిత్యం నెట్టింట మునిగితేలే నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: AP News: కొత్త ఏడాది మొదటి రోజు నుంచే.. సర్కారు అప్పులతిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.