ETV Bharat / city

6 రకాల బడులతో అయోమయం..! - పాఠశాల విద్యాశాఖ

పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న 6 రకాల బడుల్లో 3, 4, 5 తరగతులకు ఒక్కోచోట ఒక్కోలా బోధనా విధానం ఉండనుంది. కొన్నిచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాఠాలు బోధించనుండగా.. మరికొన్ని చోట్ల సెకండరీ గ్రేడ్‌ టీచర్లతో (ఎస్జీటీ) నడిపించనున్నారు. ఇది విద్యార్థుల మధ్య అభ్యసన వ్యత్యాసాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

NEW TEACHING RULES
NEW TEACHING RULES
author img

By

Published : Aug 16, 2021, 5:33 AM IST

పాఠశాల విద్యాశాఖ తీసుకొస్తున్న 6 రకాల బడుల్లో 3, 4, 5 తరగతులకు ఒక్కోచోట ఒక్కోలా బోధనా విధానం ఉండనుంది. కొన్నిచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాఠాలు బోధించనుండగా.. మరికొన్ని చోట్ల సెకండరీ గ్రేడ్‌ టీచర్లతో (ఎస్జీటీ) నడిపించనున్నారు. ఇది విద్యార్థుల మధ్య అభ్యసన వ్యత్యాసాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు 5 కి.మీ పరిధిలో 2 మాధ్యమాల్లో కొనసాగుతున్న ఉన్నత పాఠశాలల్లో ఏదో ఒక మాధ్యమాన్నే కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇది తెలుగు మాధ్యమంపై ప్రభావం చూపనుంది. ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తే మిగిలిన 1, 2 తరగతుల బోధన కుంటుపడే ప్రమాదమూ ఉంది. పూర్వ ప్రాథమిక విద్యను (పీపీ) అంగన్‌వాడీల్లో కొనసాగించనున్నారు. మతా, శిశు సంరక్షణ కార్యకలాపాలతోపాటు అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు తరగతులు బోధించాల్సి వస్తుంది.

గదులు లేని బోధన ఎలా?

నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ఈ ఏడాది 250 మీటర్ల పరిధిలోని 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల్ని 3,178 ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. ఉన్నత పాఠశాలల్లో గదుల కొరత కారణంగా ఆ తరగతులను ప్రాథమిక బడుల్లోనే కొనసాగిస్తూ.. సబ్జెక్టు టీచర్లు వచ్చి ప్రత్యేక తరగతులు చెబుతారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ 3, 4, 5 తరగతులకు ప్రత్యేకంగా తరగతి గదులు చాలా ప్రాథమిక బడుల్లో లేవు. అలాంటప్పుడు సబ్జెక్టు ఉపాధ్యాయుడు వచ్చినా తరగతుల నిర్వహణ కష్టంగా మారనుంది. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,795 సబ్జెక్టు పోస్టుల కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన ఎలా అనేదానిపైనా స్పష్టత లేదు.

* ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన చేయిస్తామని విద్యాశాఖ చెబుతోంది. మరి ‘ఫౌండేషన్‌ ప్లస్‌’ బడుల్లో పీపీ-1 నుంచి ఐదు తరగతులుంటాయి. ఇక్కడ ఆ తరగతులు ఎవరు బోధిస్తారు? ఇప్పటికే రాష్ట్రంలోని 8వేల బడుల్లో ఒక్క ఎస్జీటీనే అన్ని తరగతులకూ బోధిస్తున్నారు. ఇలాంటి చోట ఒక్కరే ఐదు తరగతులు బోధించాల్సి వస్తుంది.

ఒక్కటే మాధ్యమం..

5 కి.మీ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో 2 మాధ్యమాలుంటే విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏదైనా ఒకే మాధ్యమాన్ని కొనసాగించాలని నూతన విధానం ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీంతో ఎక్కువగా తెలుగు మాధ్యమాన్నే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని భాషావేత్తలు పేర్కొంటున్నారు. ఈ మాధ్యమం రద్దుతో మిగిలే ఉపాధ్యాయులతో 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుల వారీగా బోధన చేయించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేస్తే 86వేల మంది ఉన్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 1, 2 తరగతుల బోధనకే పరిమితం కానున్నారు.

చివరికి మిగిలేవి..

నూతన విద్యా విధాన ప్రతిపాదనల ప్రకారం 3- 10 (హైస్కూల్‌), 3-12 (హైస్కూల్‌ ప్లస్‌) తరగతులు కలిగిన బడులు రాష్ట్రంలో 10,826 మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 250 మీటర్లలోపు, వచ్చే ఏడాది కిలోమీటరులోపు ప్రాథమిక బడులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలపనున్నారు. వీటి ఫలితాల ఆధారంగా మిగతా వాటిపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం ఒక్కో ఏడాది చొప్పున మొత్తం 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో కలిపే అవకాశం ఉందనే విమర్శలొస్తున్నాయి. ఫౌండేషన్‌ బడుల్లోని పీపీ-1, 2 ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో, ఒకటి, రెండు తరగతులు పాఠశాల విద్యలో ఉంటాయి. భవిష్యత్తులో 1, 2 తరగతుల పర్యవేక్షణ విద్యాశాఖకు భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే 30లోపు విద్యార్థులున్న ప్రాథమిక బడులు 40శాతం ఉన్నాయి. వీటిలో నుంచి 3, 4, 5 తరగతులు వెళ్లిపోతే మిగిలే 1, 2 తరగతుల్లో విద్యార్థులు 10మందిలోపే ఉంటారు. వీటిలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించలేని పరిస్థితి.

ఇదీ చదవండి:

Nadu-Nedu:'నాడు-నేడు' బడులను.. ప్రజలకు అంకితం చేయనున్న జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.