ETV Bharat / city

పదో తరగతి పరీక్షలు వాయిదా... ఈ సెట్లు కూడా!

కరోనా వైరస్​ ప్రభావం విద్యారంగంపైనా పడింది. పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలు మే నెల చివరి వారంలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. మరోపక్క పాలిటెక్నిక్​​ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటితో పాటు ఏపీఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్​ 17 వరకు పొడిగించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

పదోతరగతి పరీక్షలు వాయిదా... ఈ సెట్లు కూడా!

author img

By

Published : Mar 31, 2020, 10:06 AM IST

పదో తరగతి పరీక్షలు మేలో!
పదో తరగతి పరీక్షలు మే నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నందున ఆ తర్వాత పరిస్థితి ఆధారంగా మే నెల చివరిలో పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తే ఈ షెడ్యూల్‌ను అమలు చేయనున్నారు. పదో తరగతి పరీక్షల ఆధారంగానే పాలిసెట్‌, ఇంటర్‌ ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఏప్రిల్‌ 14 వరకు సెలవుల పొడిగింపు
రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, బీఈడీ, డీఈడీ కళాశాలలకు ఏప్రిల్‌ 14వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతంలో ఈనెల 31 వరకు సెలవులు ఇవ్వగా.. దీన్ని ఏప్రిల్​ 14 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంసెట్​ దరఖాస్తు గడువు పెంపు
ఏపీఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్​​ 17 వరకు పొడిగించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దరఖాస్తుల సంఖ్య తగ్గడం, లాక్​డౌన్​ ఏప్రిల్​ 14 వరకు కొనసాగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్​ను మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది.​

పాలిటెక్నిక్​ పరీక్షలు వాయిదా
పాలిటెక్నిక్​ అకడమిక్​ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్​ 14 తర్వాత లాక్​డౌన్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం ఆధారంగా పరీక్షల షెడ్యూల్​ను ప్రకటించాలని సాంకేతిక విద్యామండలి భావిస్తోంది. ఏప్రిల్​ 28న జరగాల్సిన పాలిసెట్​ ప్రణాళిక ప్రకారం జరిగే అవకాశం కనిపించడం లేదు.

ఇదీ చూడండి: ఇంటిపట్టున ఆన్‌లైన్‌ చదువు.. విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.