విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం చూస్తుంటే.. నాడు 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంటూ పోరాటం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో పంచాయతీ ఎన్నికలపై వైకాపా సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై వైకాపా స్పందన ఏంటని అడిగిన ప్రశ్నకు.. సమాధానం చెప్పబోయిన వైవీ సుబ్బారెడ్డికి.. మంత్రి పెద్దిరెడ్డి అడ్డుపడి ఈ ప్రశ్న భాజపా నేతలను, నాడు పోరాటం చేసిన ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడును అడగాలంటూ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు