తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో దొంగ ఓట్ల విషయమై తెదేపా తప్పుడు ఆరోపణలు చేస్తోందని.. వైకాపా నేతలు అన్నారు. కొందరు స్థానిక తెదేపా నేతలు.. పోలింగ్ ప్రక్రియకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్‌కు వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దర్శనానికి వచ్చిన యాత్రికుల బస్సును అడ్డగించి ఇబ్బందులు సృష్టించారని.. తెదేపా నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీవారి దర్శనం కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులను.. బోగస్ ఓటర్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వైకాపా నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోండి: సీఈవో విజయానంద్