ETV Bharat / city

దొంగ ఓట్ల వెనుక ఉన్న మంత్రులపై కేసులు పెట్టాలి: యనమల - తెదేపా నేత యనమల తాజా వార్తలు

సీఎం జగన్​తో పాటు మంత్రులపై తెదేపా నేత, మాజీ మంత్రి యనమల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దొంగ ఓట్లు - దొంగ నోట్ల రాజ్యంగా చేశారని విమర్శించారు. దొంగ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు - దొంగ నోట్ల వెనుక ఉన్న మంత్రులపై తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

tirupati by poll 2021
yanamala ramakrishnudu slams ys jagan
author img

By

Published : Apr 18, 2021, 12:17 PM IST

రాష్ట్రాన్ని దొంగ ఓట్లు - దొంగ నోట్ల రాజ్యంగా చేశారని తెదేపా నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. దొంగల పాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక దొంగ నోట్ల అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా? అని ప్రశ్నించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతికి ఎలా వచ్చాయని నిలదీశారు. వాళ్లంతా మంత్రులు పంపిన వైకాపా వాళ్లు కాదా? అని నిలదీశారు.

'కేసులు నమోదైన 12మంది అధికార వైకాపాకు చెందిన వారు కాదా..? దొంగ ఓట్ల ముద్రణపై కాలవ శ్రీనివాసులు చెప్పినప్పుడే ఎందుకు స్పందించలేదు? వాళ్లందరిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? వెనక్కి పంపామని డీజీపీ చెప్పిన 250 బస్సులు ఎవరివి? బస్సుల్లో వచ్చిన వాళ్లంతా ఎవరు? 144 సెక్షన్ విధిస్తే ఫంక్షన్ హాళ్లలో.. రోడ్లపై వేలమంది ఎలా చేరారు..?'- యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి

ఓటమి భయంతోనే దొంగ ఓట్లు-దొంగ నోట్లతో జగన్ జిత్తులు చేశారని యనమల దుయ్యబట్టారు. తెదేపా ఫిర్యాదులపై సీఈసీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు - దొంగ నోట్ల వెనుక ఉన్న మంత్రులపై తక్షణమే కేసులు పెట్టాలన్నారు. ఓట్లు ముద్రించిన వాళ్లపై ఐపీసీ కింద కఠిన చర్యలు చేపట్టాలన్న ఆయన.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల దందా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.