తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, రాష్ట్రమంత్రి గుమ్మానూరు జయరాం, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వీరికి.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వారాంతాలలో తమిళనాడులోని ఆలయాలను మూసివేస్తుండడంతో.. భక్తులను ఆలయాలకు ఆనుమతించాలని భాజాపా తరపున డిమాండ్ చేశామన్నారు కేంద్ర సహాయ మంత్రి మురుగన్. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. శ్రీలంకలో పట్టుబడిన తమిళనాడు మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
నేడు పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చినట్లు మంత్రి జయరాం తెలిపారు. కరోనా తొలగి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి : TTD: శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ