తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, తితిదే మాజీ ఈవో దొండపాటి సాంబశివరావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.