Road Accident in High Way: తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై యడంవారిపల్లి వద్ద ద్విచక్ర వాహనంపై పీలేరు వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న భాకరాపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు.
జాతీయ రహదారిపై ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మృతులు తిరుపతి కొర్లగుంట ప్రాంతానికి చెందిన యువకులుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి :