TIRUMALA TICKETS FOR LOCALS BY TTD: తిరుమలలో నేటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తితిదే పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున 50వేల టికెట్లను జారీ చేయనుంది.
![](https://assets.eenadu.net/article_img/9brk122006638a.jpg)
తితిదే స్థానికులకు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. పట్టణంలోని రామచంద్ర పుష్కరిణి, బైరాగపట్టడి, ఎమ్మార్‌పల్లి, మున్సిపల్ కార్యాలయం, సత్యనారాయణపురం ప్రభుత్వ పాఠశాలలో సర్వదర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9గంటలకు టోకెన్లు జారీ చేస్తామని ముందుగా తితిదే ప్రకటించింది. కానీ, భక్తులు ఆదివారం రాత్రి నుంచే పెద్దఎత్తున తరలి రావడంతో రాత్రి 9గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా భక్తులు భారీఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. రోజుకు 5వేల చొప్పున.. 10 రోజులకు 50వేల టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్ల పంపిణీ రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది.
![](https://assets.eenadu.net/article_img/9brk122006638b.jpg)
![](https://assets.eenadu.net/article_img/9ttd1a_2.jpg)
![](https://assets.eenadu.net/article_img/9ttd1b.jpg)
![](https://assets.eenadu.net/article_img/9ttd1c.jpg)
ఇదీ చదవండి: