TTD: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి క్రిష్ణ పాల్ గుర్జార్, ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, సిద్దారెడ్డి, మద్దాలా గిరిధర్, తెలంగాణ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు
TTD HUNDI INCOMEఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు వచ్చినట్లు తితిదే వెల్లడించింది. శ్రీవారిని 36,126 మంది భక్తులు దర్శించుకోగా.. 14,612 మంది తమ తలనీలాలు సమర్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి.. : students make women safety device: మహిళా భద్రతా పరికరాన్ని తయారు చేసిన బాలికలు