తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేసింది. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను తితిదే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 25 వేల టికెట్లు బుక్ చేసుకునేలా వీలు కల్పించింది. వచ్చే నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను ఇవాళ విడుదల చేయనుంది.
ఇదీ చూడండి: