తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తిరుపతిలోని కేంద్రీయ వైద్యశాలలో కొవిడ్ టీకా వేయించుకున్న ఆయన.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొవిడ్ నివారణకు టీకా వేసుకోవడమే తప్పనిసరి అని.. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.