ETV Bharat / city

రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు పెంచండి: తితిదే ఈవో - ttd eo jawahar reddy directions on flower plantation

అటవీశాఖ అధికారులతో తితిదే ఈవో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కనుమ దారుల్లో రోడ్డుకు ఇరువైపులా విరివిరిగా పూల మొక్కలను పెంచాలని ఆదేశించారు. తిరుమలలో ఉద్యాన వనాల ప్రారంభానికి త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు.

ghat_roads_flower_plantation
ghat_roads_flower_plantation
author img

By

Published : Dec 14, 2020, 9:45 PM IST

భక్తులు కనుమ దారుల్లోకి వస్తూనే ఆహ్లాదకరమైన అనుభూతి పొందేందుకు రెండువైపులా విరివిగా పూల మొక్కలు పెంచాలని తితిదే ఈఓ జవహర్ రెడ్డి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలనా భవన సమావేశ మందిరంలో సాయంత్రం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

బండరాళ్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని కప్పేసేలా పెరిగే మొక్కలు నాటాలన్నారు. తిరుమలలో పవిత్ర ఉద్యానవనాల ప్రారంభానికి త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యాన విభాగం సహాయ సంచాలకులను ఆదేశించారు. కనుమ దారుల్లో బండరాళ్లు పడే అవకాశం ఉన్నచోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలలు కొన్ని ప్రాంతాలలో దెబ్బతిన్నాయని.... వాటిని పటిష్టం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. తిరుమల మ్యూజియం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈఓ ధర్మారెడ్డికి దిశానిర్దేశం చేశారు. మరుగున పడిన అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు.

ఇదీ చదవండి

రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.