అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని సిబ్బందిని తితిదే ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు. భక్తులకు సమాచారం అందించే లక్ష్యంతో తితిదే పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. భక్తుల నుంచి కాల్ సెంటర్‌కు వచ్చే సూచనలు, ఫిర్యాదులను రికార్డు చేస్తున్న విధానం, కాల్ సెంటర్ పనితీరును పరిశీలించారు.

భక్తుల సౌకర్యార్థం తితిదే చేపడుతున్న కార్యక్రమాల సమాచారం, భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందిస్తున్న తీరును ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి.. ఈవోకు వివరించారు.
ఇదీ చదవండి: