ETV Bharat / city

TTD EO TO PILGRIMS: తిరుమ‌ల‌కు వెళ్లేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో

TTD EO TO PILGRIMS: తిరుమల రెండవ కనుమదారిలో కొండచరియలు విరిగిపడినప్పటికీ.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

TTD EO TO PILGRIMS
TTD EO TO PILGRIMS
author img

By

Published : Dec 1, 2021, 6:43 PM IST

TTD EO ON GHAT ROAD ROCK FALLINGS: తిరుపతి - తిరుమల మ‌ధ్య ప్ర‌యాణించేందుకు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండవ ఘాట్ రోడ్డులోని 13వ కి.మీ వద్ద, 15వ కి.మీ వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయ‌ని, వాటి పునరుద్ధ‌ర‌ణ ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని వెల్లడించారు.

VEHICLES GOING TIRUMALA: సాయంత్రం లోపు బండ‌రాళ్లు, మ‌ట్టిని పూర్తిగా తొల‌గిస్తార‌ని ఈవో తెలియ‌జేశారు. మొద‌టి ఘాట్ రోడ్డులో వాహ‌నాల రాక‌పోక‌లు కొన‌సాగుతున్నాయ‌ని, సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి నుంచి తిరుమ‌ల‌కు 2,300 వాహ‌నాలు, తిరుమ‌ల నుంచి తిరుప‌తికి 2,000 వాహ‌నాలు ప్ర‌యాణించాయ‌ని తెలిపారు. చెన్నై ఐఐటీ ప్రొఫెస‌ర్లు తిరుమ‌ల‌కు చేరుకుని విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌ల‌ను ప‌రిశీలించార‌ని.. దిల్లీ ఐఐటీ ప్రొఫెస‌ర్లు రేపు (గురువారం) ఘాట్ రోడ్డును పరిశీలిస్తారని తెలియజేశారు.

నిపుణులు పూర్తిస్థాయిలో ప‌రిశీలించాక సమర్పించే నివేదికను పరిశీలించిన త‌రువాత.. త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్టనున్నట్లు జ‌వ‌హ‌ర్‌రెడ్డి వివ‌రించారు. ఘాట్ రోడ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్, సెక్యూరిటి, ఫారెస్ట్, ఆరోగ్య, ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ఇదీ చదవండి: TIRUMALA: తిరుమల కనుమదారిలో విరిగిపడ్డ కొండచరియలు.. రెండో ఘాట్‌రోడ్‌ మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.