తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను దేవాదాయశాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. తితిదే ఇన్‌ఛార్జి ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ధర్మారెడ్డి ఈవోగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు తితిదే ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే 1 నుంచి తితిదే ఈవోగా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి : ఈనాడు కథల పోటీకి ఆహ్వానం