తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది. సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడం, భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తితిదే అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న తితిదే రోజుకు 30 నుంచి 35 వేల మందికి దర్శనం కల్పిస్తూ వస్తోంది. పది వేల మందికి సర్వదర్శనం, 20 వేల మందికి ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేస్తూ వస్తోంది.
టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. దీంతో దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తితిదే టోకెన్ల కోటాను పెంచింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద గల కేంద్రాల్లో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను జారీ చేయనున్నారు. అదనంగా రోజుకు మరో 10 వేల టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఇదీచదవండి