తిరుమల వైకుంఠం-2లోని కంపార్టుమెంట్లను తెరవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సిద్ధంచేస్తోంది. రెండేళ్లకుపైగా వైకుంఠం-2ను మూసివేసిన తితిదే.. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ తెరవడానికి సిద్ధమైంది. వీటిలోకి దర్శన టికెట్లు లేకున్నా నేరుగా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఇప్పుడు మళ్లీ తెరవడానికి సిద్ధం చేస్తున్న ప్రకటించింది. రెండేళ్లుగా నిరుపయోగంగా ఉన్న కంపార్ట్‌మెంట్లును సిబ్బంది శుద్ధి చేస్తోంది. ప్రస్తుతం రద్దీ దృష్ట్యా దర్శన టికెట్లు లేని భక్తులను లేపాక్షి వద్ద నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తోంది.
ఇదీచదవండి: తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు