మే నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలను తితిదే ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను తితిదే తెలిపింది. ప్రధానంగా పద్మావతి పరిణయోత్సవాలు, వరద రాజస్వామి జయంతి, నృసింహ జయంతి వంటి ఉత్సవాలను నిర్వహించనున్నారు.
* మే 14న అక్షయ తృతీయ, శ్రీ పరశురామ జయంతి
* మే 16న శ్రీ నమ్మాళ్వార్ ఉత్సవారంభం
* మే 17న శ్రీ శంకరాచార్య జయంతి
* మే 20 నుంచి 22వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
* మే 22న శ్రీ వరదరాజస్వామివారి జయంతి
* మే 25న శ్రీ నృసింహ జయంతి, శ్రీ అన్నమాచార్య జయంతి, శ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, శ్రీ నమ్మాళ్వార్ సాత్తుమొర.
ఇదీ చదవండి