TSRTC Special Offer: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులకు టీఎస్ఆర్టీసీ తీపికబురు అందించింది. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ చొరవతో.. ప్రతి రోజు వెయ్యి మందికి.. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకునే వెసలుబాటు కల్పించింది. తిరుమల శ్రీవారిని.. దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్‌టికెట్‌తో పాటు తిరుమలలో శీఘ్ర దర్శన టోకెన్ పొందే వీలు కల్పించారు.
ఈ పథకాన్ని నేటి నుంచే అమలు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. దర్శనటికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం ఉందని చెప్పారు. బస్ టికెట్‌తో పాటే.. దర్శన టికెట్‌నూ బుక్‌చేసుకోవాలని సజ్జనార్ సూచించారు. WWW.TSRTCONLINE.IN లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని కనీసం 7 రోజుల ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
ఇవీ చూడండి: