రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చి... రెండేళ్ల కాలంలో రాష్ట్రాభివృద్ధిని నాశనం చేసిందన్నారు. డంప్ నిండా ఎంపీలు ఇస్తే ఏదో సాధిస్తాన్ని చెప్పిన జగన్... భాజపాకు సలాం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని మరిచారని ధ్వజమెత్తారు. ఇంకో ఎంపీ గెలిచినా కేంద్ర ప్రభుత్వానికి నమస్తే చేసుకోవాలసిందేనని విమర్శించారు. భాజపాను ప్రశ్నించడం కాంగ్రెస్‌కే సాధ్యమని వివరించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు.
తెదేపా వినూత్న ప్రచారం..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మద్యం సీసాలతో తెదేపా మహిళా కార్యకర్తలు ఆలయం ఎదుట వినూత్నంగా ప్రచారం చేపట్టారు. వైకాపా అధికారంలోకి రాగానే విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని చేస్తామని హామీ ఇచ్చిన జగన్... అధిక ధరలతో నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ టాక్స్ కోసం మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సి వస్తుందని వాపోయారు. వైకాపాకు గుణపాఠం చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థఇ విజయం సాధించాలని అవగాహన కల్పిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
ఇదీ చదవండి: