తిరుపతిలో లాక్డౌన్ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. నిత్యావసర సరకుల కొనుగోలు ఇబ్బందులు తొలగించేందుకు రైతుబజార్ల సంఖ్య పెంచుతున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన అన్ని చర్యలను అధికార యంత్రాంగం చేపడుతుందన్న ఆయన... మార్కెట్ల వికేంద్రీకరణ చేపడతామన్నారు. ఫోన్ చేస్తే మాల్స్ నిర్వాహకులే సరుకులను హోం డెలివరీ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: