తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం - తిరుమలలో శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పుష్కరిణిలో స్వామి వారు శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఏడు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో స్వామి వారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి తెలిపారు.