ETV Bharat / city

బెదిరించారు.. కబ్జా చేశారు.. చివరికి 13 మంది అరెస్టయ్యారు - తిరుపతిలో వ్యక్తిపై దాడి చేసిన 13 మంది అరెస్టు న్యూస్

ఈ నెల 2వ తేదీన తిరుపతిలోని రేణిగుంట రోడ్​లో ఓ టింబర్ డిపో యజమానిపై కొందరు బెదిరింపులకు దిగారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నిందితుడు కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ అతడి భూమిని కబ్జా చేశారు. వారిని వ్యక్తులను తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

tirupathi urban police arrested who mob attack on one person

author img

By

Published : Sep 8, 2020, 4:14 PM IST

ఎర్రచందనం స్మగ్లింగ్​ కేసులో నిందితుడు కొల్లం గంగిరెడ్డి అనుచరులమంటూ.. కొంతమంది బెదిరింపులకు దిగి.. భూ కబ్జా చేశారు. బాధితుడు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు..సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా... 13 మంది నిందుతులను గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు తిరుపతి రూరల్ మండలం సత్తారు బైలు గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి సహా మరో 11మందిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి వెల్లడించారు.

అరెస్టైన నిందితులకు ఎవరితో సంబధాలున్నాయనే విషయాన్ని విచారణలో తేలుస్తామన్నారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న ఎస్పీ... వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా తిరుపతిలో అలజడులు సృష్టించేవారిని ఉపేక్షించబోమన్నారు. దౌర్జన్యాలకు, భూ కబ్జాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పుట్టెడు కష్టం.. సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.