ETV Bharat / city

తిరుపతి బై పోల్: ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

author img

By

Published : Apr 16, 2021, 8:42 PM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రధాన పార్టీలతోపాటు.. బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున..మొత్తం 2470 ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి..రాత్రి 7 గంటల వరకూ ఓటింగ్‌ జరగనుంది.

tirupathi by poll arrangements complet
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

శనివారం జరిగే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 17లక్షల 11వేల 195 మంది ఓటర్లు ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం..2470 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. గతంలో 1500 మందికి ఓ పోలింగ్‌ కేంద్రం ఉండగా..ఈసారి కరోనా దృష్ట్యా వెయ్యిమందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటేసేందుకు..ఎక్కువ సమయం పడుతుందని భావించిన ఎన్నికల సంఘం.. పోలింగ్‌ సమయాన్ని రెండు గంటలపాటు పెంచింది. ఉదయం 7 నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఓటేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలు ఇతర పోలింగ్‌ సామాగ్రితో సిబ్బంది..నిర్దేశిత కేంద్రాలకు తరలివెళ్లారు.

తిరుపతి ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో..అధికారులు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 877 పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల్ని కేటాయించారు. 13,827 మంది రాష్ట్ర పోలీసులు, 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు బందోబస్తులో నిమగ్నమయ్యాయి.

అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 466 పోలింగ్‌ కేంద్రాల భద్రతను..సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఓటర్లకు ఏమైనా సమస్యలు ఎదురైతే...6309913960 నెంబర్‌కు ఫోన్‌ చేసికానీ, 8099999977 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు ప్రకటించారు.

ఇదీచదవండి

'మిమ్మల్ని బరువులు మోయమనటం లేదు..కూర్చుని పని చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.