ETV Bharat / city

TIRUMALA: ఈనెల 11న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్​ - Tirumala Srivari Brahmotsavalu

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో (Srivari Brahmotsavam) భాగంగా ఈ నెల 11న జరిగే గరుడసేవలో ముఖ్యమంత్రి జగన్​ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తితిదే ఈవో జవహర్​ రెడ్డి(eo jawahar reddy on cm jagan tirupati tour) తెలిపారు. ఈనెల 7నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించునున్నట్లు ఈవో వెల్లడించారు.

TTD EO Jawahar Reddy
ఈవో జవహర్‌ రెడ్డి
author img

By

Published : Oct 1, 2021, 4:44 PM IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల(Srivari Brahmotsavalu)ను ఈనెల 7నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 11న నిర్వహించే గరుడ సేవకు ముఖ్యమంత్రి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు ఈవో(eo jawahar reddy on cm jagan tirupati tour) ప్రకటించారు. సీఎం పర్యటన(cm jagan tirupati tour)లో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించనున్నట్ల చెప్పారు. దాతల సాయంతో అలిపిరి వద్ద నిర్మించిన గోమందిరం, అలిపిరి నడక మార్గం పునః ప్రారంభంతోపాటు తిరుమలలో బూందీ తయారీ నూతన పోటును సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు.

చిన్న పిల్లల కోసం తితిదే బర్డ్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్‌ కార్డియాక్‌ విభాగం, ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను సీఎం జగన్​ ప్రారంభించనున్నట్లు(cm jagan tirupati tour) తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీకి టెండర్లు పూర్తయ్యాయని.. డిసెంబర్‌ నాటికి 15 రకాల ఉత్పత్తుల అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జవహర్‌ రెడ్డి వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులు వ్యాక్సినేషన్​ పత్రాలతో రావాలని ఈవో సూచించారు.

ఇదీ చదవండి..

CM Jagan Kadapa Tour: రేపు సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.