దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి కడప - తిరుపతి - విశాఖపట్నం ప్రత్యేక రైలు (తిరుమల ఎక్స్‌ప్రెస్ - 07487) విషయంలో కొత్త విధానం అమలుచేస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 30 వరకు ఈ రైలును పొడిగించినప్పటికీ.. ఆన్లైన్లో మాత్రం 10 రోజుల వరకే రిజర్వేషన్లను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఏ రోజు టికెట్ల కోసం ప్రయత్నించినా... తరువాత 10 రోజుల వరకే రిజర్వేషన్ అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.
ఈ క్రమంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున విశాఖలోని రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వేను సంప్రదించారు. జీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తామీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వారు చెప్పారని.. వాల్తేరు రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. విశాఖ-తిరుపతి-కడప మార్గంలో ఈ రైలుకు డిసెంబర్ 30 వరకు రిజర్వేషన్ అందుబాటులో ఉండటం గమనార్హం.
ఇవీ చదవండి:
రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా?: చంద్రబాబు