ETV Bharat / city

సామాన్య భక్తులకు కరవైన కలియుగ వైకుంఠనాథుడి దర్శనం

author img

By

Published : Jul 9, 2021, 8:39 AM IST

సామాన్య భక్తులకు కలియుగ వైకుంఠనాథుడి దర్శనం కరవైంది. కరోనా రెండో దశ ఉద్ధృతితో నిలిపేసిన సర్వదర్శనాన్ని... కేసులు తగ్గుముఖం పట్టినా తిరిగి ప్రారంభించలేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కొనసాగిస్తున్న తితిదే... సర్వదర్శనం టోకెన్లు జారీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

tirumala darsham
tirumala darsham

సామాన్య భక్తులకు కరవైన కలియుగ వైకుంఠనాథుడి దర్శనం

సామాన్య భక్తులకు కలియుగ వైకుంఠనాథుడి దర్శనం కరవైంది. కరోనా రెండో దశ ఉద్ధృతితో నిలిపేసిన సర్వదర్శనాన్ని... కేసులు తగ్గుముఖం పట్టినా తిరిగి ప్రారంభించలేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కొనసాగిస్తున్న తితిదే... సర్వదర్శనం టోకెన్లు జారీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో సర్వదర్శనం ద్వారా సాధారణ భక్తులకు దేవుడి దర్శనభాగ్యం కల్పించడం పరిపాటి. తిరుమలలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 4 నెలలుగా 300 నుంచి 10 వేల రూపాయల వరకు ఏదో ఒకస్థాయిలో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు మినహా.... సాధారణ ప్రజలు శ్రీవారిని దర్శించుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా రెండో దశలో కేసుల ఉద్ధృతి వల్ల ఏప్రిల్‌ 11 నుంచి తిరుమలేశుని దర్శనంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం జారీ చేసే సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ కేంద్రాలను అధికారులు మూసేశారు. కానీ ఆన్‌లైన్‌ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను విక్రయిస్తూ దర్శనాలు కల్పిస్తోంది.

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించని తితిదే... ప్రముఖుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు మాత్రం భారీగా కేటాయిస్తోంది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, బ్రేక్‌ దర్శనాలు... ఇలా వివిధ రూపాల్లో డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసినవారు రోజుకు 18 నుంచి 20 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంపన్నులకే వేంకటేశ్వరుడి దర్శనాన్ని పరిమితం చేసిన తితిదే.. సామాన్యులకు టికెట్లు కేటాయించడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

రెండోదశ కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కర్ఫ్యూ సమయాల్లో చాలావరకు సడలింపులు ఇచ్చినందున... సర్వదర్శనం టోకెన్ల జారీపై తితిదే వెంటనే నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: అందుకే పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లేదు: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.