ETV Bharat / city

శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు: ఇవాళ గరుడవాహన సేవ - తిరుమల బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు

తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు స్వామివారు.... కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. త‌ల‌పాగా, జాటీతో గోప‌న్నగా.. బకాసురిడిని వదించే అవతారంలో దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి నిర్వహించే గరుడ వాహన సేవలో అలంకరించే... గొదాదేవి మాలలు, గొడుగులు శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు.

శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు: ఇవాళ గరుడవాహన సేవ
శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు: ఇవాళ గరుడవాహన సేవశ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు: ఇవాళ గరుడవాహన సేవ
author img

By

Published : Sep 23, 2020, 5:18 AM IST

Updated : Sep 23, 2020, 5:25 AM IST

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు... కన్నుల పండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నాల్గో రోజు కల్పవృక్ష వానల సేవలో సర్వాలంకార భూషితుడైన స్వామివారు తలపాగా, జాటీని చేతబూని గోవులు పాలించే గోపన్నగా అమ్మవార్లతో కలసి దర్శనమిచ్చారు. శ్రీదేవీ, భూదేవీ సమేతంగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించిన స్వామివారు... కొంగ రూపంలో ఉన్న బకాసురుడిని వదించే అవతారంలో అనుగ్రహించారు. రంగనాయకుల మండపంలో అస్థానాలను, నైవేద్య సమర్పణ ఇతర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పూటకో అవతారంలో వివిధ వాహన సేవలపై దర్శనమిస్తున్న స్వామివారికి ఉపశమనం కోసం మధ్యాహ్న సమయంలో స్నపనతిరుమంజనాభిషేకాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు వజ్రవైడూర్యాల అలంకరణతో ఉండే స్వామివారికి తిరుమంజనంలో వివిధ రకాల పండ్లు, ఫలాలతో ప్రత్యేకంగా తయారుచేసిన కిరీటాలు, మాలలను సమర్పించారు. కివిఫ్రూట్, ఫైనాపిల్‌, నెల్లికాయ‌లు, బ్లాక్‌ వెల్వెట్‌, ముత్యాలు, నందివ‌ర్థనం, నెమ‌లి ఈక‌లు, ప‌విత్ర మాల‌లు, వ‌ట్టివేరు, రోజ్ పెట‌ల్స్‌తో త‌‌యారు చేసిన మాల‌లు, కిరీటాలను స్వామి, అమ్మవార్లకు అలంక‌రించారు. రంగనాయకుల మండపాన్ని సైతం పండ్లతో సుందరంగా ముస్తాబుచేశారు.

ఉత్సవాలలో ప్రధానమైన, విశిష్టమైన గరుడసేవలో అలంకరించే గొడుగులు, గోదాదేవి మాలలు ఆలయానికి చేరుకున్నాయి. చెన్నై నుంచి హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి.. 11 గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకువచ్చారు. గొదాదేవికి అలంకరించిన పూలమాలలు, చిలుకలను శ్రీవిళ్లిపూత్తూరు నుంచి తిరుమలకు తెచ్చారు. పెద్దజీయర్‌ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... ఏకాంగులు పూల గంపను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తరలించారు. వీటిని గరుడ వాహనానికి అలంకరిస్తారు.

ఈ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో దర్శనమివ్వనున్న స్వామివారు రాత్రికి తనకు ఇష్టమైన గరుడ వాహనంపై... 7 గంటల నుంచి 8గంటల వరకు దర్శనం ఇవ్వనున్నారు.

శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు: ఇవాళ గరుడవాహన సేవ

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గౌతంరెడ్డి

Last Updated : Sep 23, 2020, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.