Padmavathi Ammavari Vasathontsavalu: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాలలో భాగంగా ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటలో అమ్మవారికి స్నపనతిరుమంజనాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడంతో సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. నేడు అమ్మవారికి స్నపనతిరుమంజనం, స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: థామస్ కప్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో విజేతలకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ