మానవాళి పురోభివృద్ధి సాధించాలంటే అన్ని కార్యక్రమాలు ధర్మబద్ధంగా జరగాలని.. అలాంటి సనాతన ధర్మానికి వేదం ప్రమాణమని ప్రముఖ ఆధ్మాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాంగటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో జరుగుతున్న అఖండ రుగ్వేద పారాణయణంలో చాగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపన్యసిస్తూ.. వేదాలు.. ఉపనిషత్తులు, పురణాలు మానవీయ, నైతిక, ధార్మిక విలువలను మానవాళికి బోధిస్తాయని.. ప్రతి ఒక్కరూ వాటిని చదవాలని కోరారు. లోకం సుభిక్షంగా ఉండాలంటే వేదాల సారాన్ని వ్యాప్తి చేయాలన్నారు. వేద పరిరక్షణకు తితిదే చేస్తున్న కృషి అభినందనీయమని చాగంటి చెప్పారు.
ఇదీ చూడండి. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,926 కోట్లు మంజూరు