ETV Bharat / city

HIGH COURT ON KUPPAM: ఇప్పుడు ప్రచారానికి.. రేపు నామినేషన్​కా? - kuppam latest news

కుప్పంలో ఎన్నికల ప్రచారంపై డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారంపై డీఎస్పీ విధించిన ఆంక్షలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

కుప్పం ప్రచారంలో ఆంక్షలు...డీఎస్పీ ఉత్తర్వులు కొట్టివేత

author img

By

Published : Nov 11, 2021, 3:54 PM IST

Updated : Nov 12, 2021, 2:13 AM IST

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేని పక్షంలో ఇండియన్‌ పోలీసు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పలమనేరు డీఎస్పీ నోటీసులు జారీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘమే షరతు విధించలేదని.. అందుకు భిన్నంగా డీఎస్పీ ఎలా వ్యవహరిస్తారని న్యాయస్థానం మండిపడింది. భవిష్యత్తులో నామినేషన్ వేయాలన్నా అనుమతి తప్పనిసరి అని పోలీసులు నోటీసులు ఇస్తారేమోనని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డీఎస్పీ ఇచ్చిన నోటీసును పరిశీలిస్తే.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని పేర్కొంది. ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ డీఎస్పీ జారీ చేసిన నోటీసుపై స్టే విధించింది . ఇలాంటి నోటీసు జారీ చేసినందుకు డీఎస్పీ నుంచి వివరణ తీసుకొని కోర్టుకు నివేదిక సమర్పించాలని చిత్తూరు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు తెదేపా నేతలు, మాజీ మంత్రి ఆమర్‌నాథ్‌ రెడ్డి, పులవర్తి నాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మునిరత్నం ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వారిని అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కుప్పంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ పలమనేరు డీఎస్పీ ఈ నెల 8న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ తెదేపా తరఫున 15, 16 వార్డు కౌన్సిలర్లుగా బరిలోకి దిగిన వి. జయ లక్ష్మి, జి. హర్షధర్మతేజ గురువారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం ధాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. ఇలా ముందస్తు అనుమతి తీసుకోవడం చట్టవిరుద్ధం అని వారన్నారు. అధికార పార్టీ నేతలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రచారానికి వెసులుబాటు కల్పిస్తున్నారని చెప్పారు. ఈ వాదనలు పరిగణలోనలోకి తీసుకున్న డీఎస్పీ నోటీసుపై స్టే విధించారు.

హైకోర్టులో ఊరట...

కుప్పం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుగుదేశం నేతలు 19 మందిపై నమోదుచేసిన కేసులో అరెస్ట్‌ సహా తొందరపాటుచర్యలొద్దని కుప్పం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, కుప్పం ఎస్​హెచ్​వో కు నోటీసులు జారీచేసింది. తనపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించారని చాంబర్లోకి చొచ్చుకొచ్చి లాక్కెళ్లి నిర్బంధించారని కుప్పం మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు తెలుగుదేశం నేతలు అమర్‌నాథ్‌ రెడ్డి, పులవర్తి నాని, జి. శ్రీనివాసులు తదితరులపై కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టేయాలని.. తెలుగుదేశం నేతలు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. విధులను ఎవరు అడ్డుకున్నారో ఫిర్యాదిదారు స్పష్టంగా పేర్కొనలేదని పిటీషనర్ల న్యాయవాది వాదించారు. పిటిషనర్లపై ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు. దాడికి పాల్పడలేదన్నారు. తెలుగుదేశం తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు, వేధించేందుకు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారన్నారు. వారి విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అరెస్ట్ సహా తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 12, 2021, 2:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.