తితిదే పాలకమండలి తదుపరి సమావేశంలో చర్చించిన తర్వాతనే గరుడ వారధి నిధుల కేటాయింపులపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో తితిదే, తిరుపతి నగరపాలక సంస్థ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గరుడ వారధి పనులపై అధికారులతో చర్చించిన ఛైర్మన్... గత ప్రభుత్వంలో తితిదే పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ను ప్రారంభించారని అన్నారు. గరుడ వారధిపై శ్రీవారి నామాల ఏర్పాటు విషయంలో వస్తున్న అంశాలను ఆగమ శాస్త్ర పండితుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. వాహనాలు తిరిగే చోట వాటి ఏర్పాటు ఆవశ్యకతపైనా చర్చిస్తామన్నారు. డిజైన్ మార్పులు సహా పూర్తిస్థాయి నిర్ణయాలన్నీ బోర్డు సమావేశం తర్వాతనే వెల్లడిస్తామన్నా ఆయన... అప్పటి వరకూ వారధి పనులను ఆపమని చెప్పినట్లు తెలిపారు. పాలకమండలి సమావేశంలో నిర్ణయం తర్వాత పనులను పున: ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
తిరుపతిలో గరుడవారధి నిర్మాణ పనులు నిలిపివేత
తిరుపతిలో గరుడవారధి నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. డిజైన్ మార్పులు సహా పూర్తిస్థాయి నిర్ణయాలన్నీ తితిదే బోర్డు సమావేశం తర్వాతనే వెల్లడిస్తామని పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అప్పటి వరకూ వారధి పనులను ఆపమని చెప్పినట్లు తెలిపారు.

ఇదీ చదవండి